News August 13, 2025

నేడు భీమవరంలో మాజీ సీఎం జగన్ పర్యటన

image

మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, విఎస్స్‌ గార్డెన్స్‌లో జరిగే వేడుకకు హాజరు అవుతారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News

News August 13, 2025

మహాదేవపట్నంలో చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభం

image

ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.

News August 13, 2025

భీమవరం: సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

image

‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా భీమవరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం ఆమె సెల్ఫీ దిగారు. ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని ఆమె కొనియాడారు.

News August 13, 2025

పోడూరు తహశీల్దార్‌కి కలెక్టర్ అభినందనలు

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.లక్ష డ్రాఫ్ట్‌ను అందించిన పోడూరు తహశీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అభినందించారు. తహశీల్దార్లందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి రెడ్ క్రాస్‌కు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.