News August 29, 2025
నేడు మంచిర్యాల జిల్లాలో MP వంశీకృష్ణ

పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మాతాశిశు హాస్పిటల్‌ను ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కోటపల్లిలో పిడుగుపాటుకు గురై చికిత్స పొందుతున్న రాజమల్లును MP పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సోమనపల్లిలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు.
Similar News
News August 29, 2025
RECORD: 4 బంతుల్లో 4 వికెట్లు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌తో మ్యాచులో నార్త్ జోన్ ఫాస్ట్ బౌలర్ ఆఖిబ్ నబీ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. 53వ ఓవర్లో చివరి 3 బంతులకు 3 వికెట్లతో హ్యాట్రిక్ సాధించిన అతడు, తాను వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి మరో వికెట్ తీశారు. దీంతో ఈ టోర్నీలో 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మొత్తంగా 5 వికెట్లు సాధించారు. ఇది ఆయనకు డెబ్యూ మ్యాచ్ కావడం గమనార్హం.
News August 29, 2025
ప్రతి రైతుకు యూరియా సమానంగా అందించాలి: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే

ప్రతి రైతుకు యూరియా సమానంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. యూరియా సక్రమంగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా యూరియాను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News August 29, 2025
ఒంగోలు: ప్రైవేటు ఆసుపత్రుల్లో సోదాలు

ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి .వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కాన్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం తొమ్మిది టీములు వైద్యశాలలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.