News January 31, 2025

నేడు మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్: DEO

image

పదో తరగతి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు ఈనెల 31న ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరు కావాలని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయాలని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

ఏలూరు: వర్జీనియా పొగాకుకు రికార్డు ధర

image

వర్జీనియా పొగాకు ధరలు జోరందుకున్నాయి. గతంలో చూడని విధంగా కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో కిలో రూ. 430 పలికి చరిత్ర సృష్టించింది. పోయిన సంవత్సరం రూ.411 పలికింది. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం రూ. 418 కి అమ్ముడుపోయింది. ఇదే రేట్లు కొనసాగితే లాభదాయకంగా ఉంటుందని రైతులు అంటున్నారు.

News September 14, 2025

HYD: అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయండి: జాయింట్ సీపీ

image

పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా ఉ.8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సహాయం కోసం 9010203626ను సంప్రదించాలన్నారు.

News September 14, 2025

17న కంటోన్మెంట్‌కు కేంద్రమంత్రి రాక

image

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 17న కంటోన్మెంట్‌కు రానున్నారు. కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి డిఫెన్స్ మినిస్టర్‌తో పాటు కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ హాజరై తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం పికెట్ పార్కులో మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.