News December 22, 2025

నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది. అలాగే సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, బడ్జెట్ కసరత్తు, MPTC, ZPTC ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్‌పై మంత్రులతో చర్చించనున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ, వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 26, 2025

ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు..

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 26,130 వద్ద, సెన్సెక్స్ 50 పాయింట్లు కోల్పోయి 85,350 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

News December 26, 2025

లిప్ లైనర్ వాడుతున్నారా?

image

లిప్‌స్టిక్ వేసుకొనేముందు లిప్ లైనర్ వాడటం ముఖ్యం. దీని వల్ల మీ లిప్‌స్టిక్ కిందికి, పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అలాగే ఇది పెదాలకు సరైన షేప్ ఇస్తుందని చెబుతున్నారు. లైనర్‌తో పెదాల చుట్టూ ఔట్ లైన్ గీసి తర్వాత లిప్‌స్టిక్ వెయ్యాలి. లిప్‌స్టిక్ వేశాక తప్పనిసరిగా టిష్యూతో లిప్స్‌ని ప్రెస్ చేయండి. ఇది స్మడ్జింగ్, ఎక్స్‌ట్రా లిప్‌స్టిక్‌ని దూరం చేస్తుందని సూచిస్తున్నారు.

News December 26, 2025

మానసిక ధైర్యాన్ని అందించే మహాకాళి అమ్మవారు

image

దశమహావిద్యలలో మొదటి రూపమైన శ్రీ మహాకాళీ దేవి శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం. కృష్ణ వర్ణంతో ప్రకాశించే ఈమెను ఆరాధిస్తే సకల వ్యాధులు, గ్రహ దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయని నమ్మకం. తంత్రోక్త మార్గంలో ఈ మహావిద్యను ఉపాసించే వారికి మానసిక ధైర్యం, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో విజయం లభిస్తుంది. సాధకులకు రక్షణ కవచంలా నిలిచి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.