News October 6, 2024
నేడు మచిలీపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్‌లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు హీరో హీరోయిన్ సుహాస్, సంగీర్తనతోపాటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, చిత్ర యూనిట్ మొత్తం తరలి రానుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 19, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

వసతి గృహాల్లో అంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కృష్ణా కలెక్టర్
* ఇన్‌స్టా పరిచయం.. ఝార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత
* కృష్ణాలో బెల్ట్ షాపుల జోరు.. మామూళ్ల హోరు.!
* మచిలీపట్నం: బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
* విజయవాడ గాంధీ హిల్స్‌లో యువత వెకిలి చేష్టలు.!
* కృష్ణా : పది పరీక్షలకు 297 కేంద్రాలు.. 61 సమస్యాత్మక కేంద్రాలు
News February 19, 2026
వసతి గృహాల్లో అంటు వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాల్లో అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో అంతర్ శాఖల ఉమ్మడి తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
News February 19, 2026
మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.


