News January 26, 2025

నేడు మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు: ఏసీపీ

image

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. శనివారం ఆయిన మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం విక్రయాలు జరిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. బెల్ట్ షాపు నిర్వహించిన మద్యం విక్రయాలు జరిపిన తమకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ తెలిపారు.

Similar News

News September 17, 2025

24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

image

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News September 17, 2025

సిరిసిల్ల : తొలితరం పోరాట యోధుడు రావుల నరసింహ రెడ్డి

image

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన తొలితరం యోధుడు రావుల నరసింహ రెడ్డి. రాజన్న సిరిసిల్లి జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఈయన 1949 ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసి పోరాటంలో భాగమయ్యారు. పేదల కోసం అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆయనను ఒక గొప్ప వీరుడిగా గుర్తుంచుకుంటారు.

News September 17, 2025

MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

image

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.