News February 22, 2025
నేడు మల్లన్నకు టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా నేటి శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం(కాణిపాకం) శ్రీ స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాస్త్రోక్తంగాపట్టు వస్త్రాలను ఆయా దేవస్థానాల ఈవోలు, అధికారులు, అర్చకులు సమర్పించనున్నారు.
Similar News
News February 22, 2026
65-10-10-15 ఫార్ములాతో మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్

మార్కెట్ అనిశ్చితిని తట్టుకోవడానికి 65-10-10-15 అనే మల్టీ-అసెట్ ఫార్ములా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో 65% ఈక్విటీ, 15% డెట్, తలా 10% బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలి. ‘బోరింగ్ థాలీ’గా పిలిచే ఈ విధానం వల్ల ఒక రంగం నష్టాల్లో ఉన్నా మరోటి లాభాలతో బ్యాలెన్స్ చేస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ వెనక పరిగెత్తకుండా పెట్టుబడులను ఇలా విభిన్నంగా పంచుకుంటే రిస్క్ తగ్గి దీర్ఘకాలంలో సంపద పెరుగుతుంది.

సిరిసిల్ల: దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌లోని జి-33 గదిలో సమర్పించాలని సూచించారు.