News August 21, 2025

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎస్

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అమరరాజ కంపెనీ రోడ్డుతోపాటు, భూత్పూర్ మండలం అమిస్తాపూర్-రాందాస్ తండా, అప్పన్నపల్లి-ఇదిరా గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో రోడ్ల మరమ్మతులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.

Similar News

News November 9, 2025

చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.

News November 9, 2025

MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.

News November 9, 2025

MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.