News December 27, 2025
నేడు మానుకోటలో ఆ ఇద్దరు!

ఒకరు ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరొకరు సీఎం తర్వాత సీఎం అంతటి లీడర్ ఇద్దరు ఓకే రోజు మహబూబాబాద్‌లో శనివారం పర్యటిస్తున్నారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఉప్పు, నిప్పు లాంటి నేతలు ఒకరిపై మరొకరు ఎలాంటి పరుష పదాలు వాడుతారో? అని మానుకోట ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Similar News
News December 27, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మళ్లీ మార్పులు.!

ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అభ్యంతరాలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పొదిలిని ప్రకాశం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో కలిపే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
మూడు నెలల్లో 218 మంది నిందితులపై కేసు: ఎస్పీ

గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గత మూడు నెలల (అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025) కాలంలోనే 218 మంది నిందితులపై 38 కేసులు నమోదు చేసి, 164 మందిని అరెస్ట్ చేసి, సుమారు 65 కేజీల గంజాయిని మరియు 150 గ్రాముల ద్రవ గంజాయిని, 28 గ్రాముల MDMA, 05 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
News December 27, 2025
సూర్యాపేట: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ బాబు మృతి చెందాడని ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌కు చెందిన కారే మహేశ్ ఆరోపించారు. బాబును సూర్యపేటలోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తరలించామన్నారు. ఏమైనా సమస్య ఉందా అని అడిగితే HYD తరహా వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారన్నారు. చివరకు బాబు ప్రాణం తీశారని కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల వైఫల్యం వల్లే తమకు పుత్రశోకం మిగిలిందని తల్లిదండ్రులు వాపోయారు.


