News February 8, 2026
నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సభలకు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నార్సింగి నివాసం నుంచి బయల్దేరి, గోపన్నపల్లి హెలిప్యాడ్ ద్వారా తాండూర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రచారం అనంతరం నర్సంపేట, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు వర్ధన్నపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.
Similar News
News February 16, 2026
వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వేగంగా పూర్తిచేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణాల పథకాల అమలుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలని ఆదేశించారు. నిరుపేద కుటుంబాలకు 100 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.
News February 16, 2026
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: ADB కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.
News February 16, 2026
రంజాన్.. నగరానికి వచ్చేసింది పోషకాల ఖర్జూర్

రంజాన్ మాసంలో ఉపసవాసమున్న వారు ఇష్టపడేది ఖర్జూర్.. ఉపవాసం ముగించేటపుడు ఖర్జూర్‌ను తప్పకుండా తీసుకుంటారు. ఈ 4 రోజుల్లోనే నగరానికి దాదాపు 3వేల టన్నుల విదేశీ ఖర్జూర్ దిగుమతి అయిందని వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 100 రకాల ఖర్జూరం సిటీలో అందుబాటులో ఉంది. రకాన్ని బట్టి కిలో రూ.100 నుంచి రూ.2,200 వరకు ఉంటుంది. ఈ నెల 19 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని సమాచారం.


