News May 7, 2024
నేడు మెదక్‌కు మాజీ సీఎం కేసీఆర్ రాక
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం రాత్రి మెదక్ పట్టణానికి చేరుకోనుంది. కామారెడ్డి జిల్లా నుంచి రాత్రి 8 గంటలకు బస్సుయాత్ర మెదక్ పట్టణంలోకి ప్రవేశిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో బస్సుయాత్ర కొనసాగనుంది.
Similar News
News January 17, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
సంక్రాంతి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 18 నుంచి పునః ప్రారంభం అవుతున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు రెగ్యులర్‌గా రావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు యథావిధిగా నిర్వహించాలని చెప్పారు.
News January 17, 2025
సంగారెడ్డి: అక్కాచెల్లెళ్ల మృతి.. కేసు నమోదు
అదృశ్యం అయిన బాలిక బావిలో శవమై దొరికింది. SI వివరాల ప్రకారం.. సంగారెడ్డి(D) రాయికోడ్ (M) సంగాపూర్‌కి చెందిన సతీశ్-అనితకు ఇద్దరు కుమార్తెలు. వీరు విడిపోగా.. పిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. ఇటీవల చిన్నకూతురు హరిత(6) మృతిచెందింది. ఈక్రమంలో ఈ నెల 9న వైష్ణవి ఇంటి నుంచి వెళ్లిపోయి.. గురువారం గ్రామ శివారులోని బావిలో శవమై తేలింది. అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానం ఉన్నట్లు నాన్నమ్మ ఫిర్యాదు చేసింది.
News January 17, 2025
BREAKING.. మెదక్: కొడుకును నరికి చంపిన తండ్రి
వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(30) మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ పడటంతో పడుకున్న శ్రీకాంత్‌ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.