News October 8, 2025
నేడు మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన..

మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు పర్యటించనుంది. డాక్టర్ కె. పొన్ను స్వామి, వినోద్ కుమార్ వంటి సభ్యులు కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో పర్యటిస్తారు. ఎం.బి. పూర్ బ్రిడ్జి, తిమ్మానగర్ రోడ్డు, రామాయంపేట, హవేలి ఘనపూర్ మండలాలతో పాటు ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్నారు.
Similar News
News October 8, 2025
MDK: వనదుర్గ మాత సన్నిధిలో కేంద్ర బృందం

ఏడుపాయల వన దుర్గ మాతను కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ కే.పొన్ను స్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఎస్ఎస్.పింటు దర్శించుకున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో మెదక్ జిల్లాలో పర్యటించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వరదను స్వయంగా పరిశీలించారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, అధికారులతో నేరుగా మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫోటోలను పరిశీలించారు.
News October 8, 2025
మెదక్: పోటాపోటీగా అండర్-17 బాలబాలికల పోటీలు

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాల, బాలికలకు కబడ్డీ పోటీలు బుధవారం జరిగాయి. 210 మంది బాలికలు, 210 మంది బాలురు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ఎంపికైన మెదక్ జిల్లా జట్టు ఇదే నెల 10న సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా పోటీలలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర పీఈటీల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు.
News October 8, 2025
మెదక్‌లో కేంద్ర బృందం పర్యటన ప్రారంభం: కలెక్టర్

మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం సభ్యులు మెదక్ పట్టణానికి చేరుకున్నారు. డాక్టర్ కె.పొన్ను స్వామి నేతృత్వంలోని బృందానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ బృందం జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని పరిశీలించనుంది.