News May 7, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

image

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

Similar News

News January 17, 2025

భీమదేవరపల్లి: ఎస్సైకి తప్పిన ప్రమాదం

image

భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సైగా పనిచేస్తున్న సురేశ్ కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి శివారులో టిప్పర్‌ను తప్పించబోయి.. ఎస్సై ప్రయాణిస్తున్న <<15167764>>కారు పల్టీలు కొడుతూ<<>> పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎస్సై క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News January 17, 2025

ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,31,585 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.80,158, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.36,200, అన్నదానం రూ.15,227,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రుద్రంగి మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్లాపూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో తప్పిపోయిన మహిళ. @ గొల్లపల్లి మండలంలో బోల్తా పడిన కారు. @ జగిత్యాల లో పోలీసులకు క్రీడా పోటీల నిర్వహణ. @ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కరీంనగర్ కలెక్టర్.