News April 9, 2024
నేడు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఆమంచి ప్రకటన

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం మధ్యాహ్నం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి.. ఏడాది పాటు పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే ఆయనకు చీరాల టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జిల్లా అంతటా తీవ్ర ఆసక్తిగా మారింది.
Similar News
News September 7, 2025
ప్రకాశం ప్రజలకు కలెక్టర్ ముఖ్య సూచన

ఒంగోలు కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అర్జీలను Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు.
News September 7, 2025
ప్రకాశంలో పలు ఆలయాలు మూసివేత..!

ప్రకాశం జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు.
News September 7, 2025
ఒంగోలులో 5K రన్.. ప్రైజ్ మనీ ఎంతంటే.!

ఒంగోలులో ఈనెల 12న కలెక్టర్ కార్యాలయం నుంచి 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 17 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులు, అలాగే ట్రాన్స్‌జెండర్ విభాగాల్లో ఈ పరుగు పందెం నిర్వహిస్తామన్నారు. పోటీలో ప్రథమ విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.7వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 10వ తేదీలోగా 9493554212 నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.