News September 17, 2024

నేడు రాజమహేంద్రవరంలో స్వచ్ఛతా హీ సేవ, విశ్వకర్మ జయంతి వేడుకలు

image

రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని, విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9:30 నుంచి రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుతామన్నారు.

Similar News

News August 21, 2025

రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

News August 21, 2025

ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ఎత్తివేత

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 12.90 అడుగులకు చేరడంతో జల వనరుల శాఖ అధికారులు బ్యారేజీలోని 175 గేట్లను ఎత్తి, 11.51 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.

News August 21, 2025

తూ.గో: నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్ నిఘా

image

జిల్లాలో బహిరంగ మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, పాడుబడిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని ఆయన చెప్పారు.