News June 29, 2024
నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TGలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, గద్వాల, KNR, MBNR, VKD, MDK, NGKL, NPT జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు APలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు అల్లూరి, కాకినాడ, డా.బీ.ఆర్.అంబేడ్కర్, తూ. గో, ప. గో, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News July 6, 2025
148 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించాడు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<16956685>>రికార్డుల<<>> మోత మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా ఆయన ఖ్యాతి గడించారు. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి ప్లేయర్‌గానూ అతడు రికార్డులకెక్కారు.
News July 6, 2025
రెండ్రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!

AP: శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. దీంతో 8, 9 తేదీల్లో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.
News July 6, 2025
‘అన్నదాత సుఖీభవ’ అనర్హులకు అలర్ట్

AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్‌లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవాకేంద్రంలోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈనెల 10లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ సూచించారు.