News March 28, 2025
నేడు, రేపు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారాలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో జరిగే ఇఫ్తార్ విందు, పలు డివిజన్లలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఖమ్మం పట్టణంతో పాటు రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం తల్లాడ మండలంలో పర్యటించనున్నారు.
Similar News
News March 30, 2025
గాంధీ భవన్‌లో ఉగాది వేడుకల్లో Dy.CM భట్టి

హైదరాబాద్ గాంధీ భవన్‌లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
News March 30, 2025
ఖమ్మం: 488 కేంద్రాలు.. ఆశలన్నీ బోనస్ పైనే!

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో 2.10 లక్షల ఎకరాల్లో వరికి 344, భద్రాద్రి కొత్తగూడెంలో 65వేల ఎకరాలకు గాను 144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్‌లోనూ సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, వానాకాలం బోనస్ కొంతమేర పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్
News March 30, 2025
పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం.. భట్టిVSపొంగులేటి

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం నియామకం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్యానికి దారి తీసింది. Dy.CM చొరవతో ఆలయ ఛైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్, సభ్యులను నియమిస్తూ మార్చి 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రి సురేఖను పొంగులేటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో లిస్టు రెడీ చేశారని.. పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.