News July 26, 2024
నేడు రైతు బజార్‌లో టమాటా ధర కిలో రూ.38

విశాఖలోని అన్ని రైతు బజార్‌లలో కిలో టమాటాను రూ.38 చొప్పున శుక్రవారం అందుబాటులో ఉంటుందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ వారి ద్వారా రైతుబజార్‌లలో రాయితీ ధరలకే విక్రయించనున్నట్టు వెల్లడించారు. ఈరోజు ధర రూ.48, బుధవారం రూ.54, మంగళవారం రూ.61, సోమవారం రూ.58 గా విక్రయాలు జరిగాయి.
Similar News
News September 24, 2025
కార్పొరేటర్లు టూర్‌లో.. మేము బతుకు కోసం పోరులో!

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ పేరుతో GVMC ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఉపాధి కోల్పోయామంటూ చిరు వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ కష్టాలను తీరుస్తారని గెలిపించిన కార్పొరేటర్లు మాత్రం ఈ కష్ట సమయంలో తమను గాలికొదిలేసి విహార యాత్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు.
News September 24, 2025
21 వెండింగ్ జోన్లు గుర్తింపు: యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి

విశాఖలో 21 వెడింగ్ జోన్లను గుర్తించామని జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి తెలిపారు. ఇంకా మరికొన్ని గుర్తించాలని నిర్ణయించామన్నారు. యూసీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల అర్హత సర్వే 90% పూర్తయిందని తెలిపారు. బీపీఎల్ కేటగిరీ, స్ట్రీట్ వెండర్ గుర్తింపు ఉండాలన్నారు. వీరికి వెండింగ్ జోన్లలో దుకాణాలు కేటాయిస్తామన్నారు.
News September 23, 2025