News October 31, 2025

నేడు వరంగల్‌కు సీఎం..!

image

వరంగల్ నగరంలో వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం రానున్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్లలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News October 31, 2025

విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

image

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: vpt.shipping.gov.in

News October 31, 2025

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కవిత

image

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన,బూజు పట్టిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు.

News October 31, 2025

అనకాపల్లి: ‘భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం’

image

భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ అన్నారు. పెందుర్తి పునరావాస కేంద్రంలో బాధితులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబుతో కలిసి నిత్యవసర సరుకులను శుక్రవారం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్లే తక్కువ నష్టం జరిగిందన్నారు.