News February 24, 2025
నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
Similar News
News February 23, 2026
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

TG: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. 16వ తేదీ గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 17, 18వ తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 20వ తేదీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
News February 23, 2026
కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25, 26న నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల్లో నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.com)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఉన్నాయి. ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.