News October 10, 2025
నేడు వర్ధన్నపేటలో మెగా జాబ్ మేళా..!

వర్ధన్నపేటలో నేడు యువ పరివర్తన ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, టెక్నీషియన్, టైలరింగ్, బ్యూటిషన్, మెకానిక్, తదితర రంగాల్లో దాదాపు 300కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు వారి విద్యార్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 10, 2025
కాఫ్ సిరప్ డెత్స్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

దగ్గు మందు తాగి 20మందికి పైగా చిన్నారులు చనిపోయిన ఘటనపై దాఖలైన పిల్‌ను SC కొట్టేసింది. CBI దర్యాప్తు చేయాలని, డ్రగ్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయా రాష్ట్రాలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. CBIతో దర్యాప్తు అవసరం లేదన్నారు. దీంతో CJIతో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.
News October 10, 2025
HYD: సైబర్ మోసం.. రూ.7.7కోట్లు మాయం

మ్యాట్రిమోనీ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని HYD నగరంలోని సైబర్ సెక్యూరిటీ టీం హెచ్చరించింది. మ్యారేజ్ కం ఇన్వెస్ట్మెంట్ మోసాలతో ఓ వ్యక్తి ఏకంగా రూ.7.7కోట్లు పోగొట్టుకున్నట్లుగా వివరించింది. నూతన లింకులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ప్రతి మెసేజ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ మోసం గుర్తిస్తే 1930 కు కాల్ చేయాలని సూచించింది.