News February 24, 2026
నేడు వికారాబాద్‌లో జరిగేది ఇదే!

✓ నేడు పరిగిలో డయల్ యువర్ డీఎం
✓ తాండూరు (M) వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు
✓ కొడంగల్ సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు
✓ కుల్కచర్ల రుక్మిణీ పాండురంగస్వామి వార్షికోత్సవాలు
✓ VKBలో కొనసాగనున్న డీసీసీల శిక్షణ తరగతులు
✓ 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు
Similar News
News February 27, 2026
కన్నీళ్లు పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో <<19251338>>క్లీన్‌చిట్<<>> లభించడంతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆప్ పార్టీ తప్పు చేయలేదు. మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని విమర్శించారు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న సందర్భంగా భార్య, కూతురి ఆనందం అవధులు దాటింది.
News February 27, 2026
HYD: ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి సోదరుడి దాడి

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు కొందరు దుండగులు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివారులోకి పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
News February 27, 2026
నిర్మల్: మార్చి 4 నుంచి ‘సదరం’ క్యాంపులు

జిల్లాలో మార్చి 4వ తేదీ నుంచి 31 వరకు వివిధ కేటగిరీల దివ్యాంగులకు ‘సదరం’ క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని, మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిన వారు మాత్రమే కేటాయించిన కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట అవసరమైన ధ్రువపత్రాలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


