News April 25, 2024

నేడు విజయనగరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. డెంకాడ మండలం సింగవరం వద్ద సా.4 గంటలకు ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు. వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు హెలీప్యాడ్‌‌లు ఏర్పాటు చేశారు.

Similar News

News April 21, 2025

రాజాం: జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

image

మండలంలోని ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తరి నాగరాజు రాజాంలోని ఆర్కే కాంప్లెక్స్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇస్తున్నారని వెళ్లారు. జనసేన నాయకుడు పొగిరి సురేశ్ బాబు తనను ఇక్కడికెందుకు వచ్చావని కులం పేరుతో తిట్టి, అతని అనుచరులతో దాడి చేయించాడని రాజాం పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రవి కుమార్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2025

VZM: ఈ నెల 22న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల పర్యటన

image

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 22వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకొని, 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు చేరుకొని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్ట్ పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

News April 20, 2025

గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

image

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!