News February 23, 2025

నేడు విజయవాడకు వైఎస్ జగన్ రాక

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం విజయవాడకు రానున్నారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి సాయంత్రం 4.40కి బయలుదేరి 6:25కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌కు 6.55కు చేరుకొని మల్లాది కుమార్తెను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి వెళ్తారు.   

Similar News

News September 17, 2025

HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

image

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

News September 17, 2025

శాసన సభ స్పీకర్‌ను కలిసిన గుంటూరు ఎస్పీ

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.

News September 17, 2025

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి: సీతక్క

image

గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో 100% టాయిలెట్, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.