News March 26, 2025
నేడు విజయవాడకు వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గురునానక్ కాలనీలోని NAC కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అనంతరం జగన్ వైసీపీ ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు.
Similar News
News March 29, 2025
కల్వకుర్తి: ‘167 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చాం’

కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ టాస్క్ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రతినిధులతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి చెందిన దాదాపు 167 మంది మహిళలకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఆయన చెప్పారు.
News March 29, 2025
బయటి జ్యూస్‌లు తాగుతున్నారా?

బయటికెళ్లినప్పుడు వేసవి వేడికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ జ్యూస్‌లు తాగేస్తుంటాం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. HYDలో ఫుడ్ హబ్‌గా పేరొందిన DLF ప్రాంతంలో పలు జ్యూస్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. అక్కడ కుళ్లిన పళ్లు, మురికి ఐస్ గడ్డలు, కాలం చెల్లిన పాలు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. దీంతో ఆ షాప్‌లకు అధికారులు నోటీసులిచ్చారు.
News March 29, 2025
రాజమండ్రి: తప్పిన పెను ప్రమాదం..41 మంది సేఫ్

ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం భద్రచలం నుంచి రాజమండ్రికి బయలుదేరింది. బస్సు కూనవరం ఘాటీలో దుర్గమ్మ గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ ఫెయిలయ్యింది. గమనించిన డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలువరించాడు. బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ను ప్రయాణీకులు అభినందించారు.