News March 10, 2025
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఫార్చ్యూన్ మురళి పార్క్‌లో నేడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మంటాడ 2 మ్యాన్ హ్యూటన్ అనే పుస్తకాన్ని సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకం నోరి దత్తాత్రేయుడు రచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కూడా అతిథులుగా పాల్గొననున్నారు.
Similar News
News September 17, 2025
స్మృతి మంధాన సూపర్ సెంచరీ

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.
News September 17, 2025
జగిత్యాల కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలు

జగిత్యాల కలెక్టరేట్ లో విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేశారు. సృష్టికర్త విశ్వకర్మ అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజా గౌడ్, బిఎస్ లత, బీసీ సంక్షేమ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
జగిత్యాల కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జగిత్యాల కలెక్టరేట్ లో బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బి ఎస్ లత లు నిరంజన్ రెడ్డికి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా సాధించిన ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రసంగించారు.