News December 22, 2025
నేడు విజయవాడలో PGRS కార్యక్రమం

ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నటల్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News December 27, 2025
కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
News December 27, 2025
మంత్రి రవీంద్ర పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
News December 27, 2025
అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.


