News September 20, 2025
నేడు విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు స్పాట్ అడ్మిషన్లు

వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులోని తెలుగు యూనివర్సిటీ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు అడ్మిషన్ల కోసం శనివారం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
Similar News
News September 20, 2025
TSR కంపెనీకి రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ!

మాజీ MP టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. ఆ కంపెనీ రూ.8,100 కోట్లను కెనరా నేతృత్వంలోని బ్యాంకులకు చెల్లించడంలో విఫలమైంది. 2022లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో దివాలా పిటిషన్ దాఖలైంది. ఏ కంపెనీ దాన్ని కొనుగోలు చేయకపోవడంతో TSR కుటుంబమే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.2,400 కోట్లు చెల్లిస్తామని చెప్పగా NCLT ఆమోదం తెలిపింది.
News September 20, 2025
ఉల్లి పంటలో బోల్డింగ్ అంటే ఏమిటి?

ఉల్లి మొక్కల్లో శాఖీయ పెరుగుదల పూర్తికాక ముందే పుష్పించడాన్ని బోల్డింగ్ అంటారు. జన్యుపరమైన లోపాలు, ఉష్ణోగ్రతల్లో అసమానతలు, నాణ్యతలేని విత్తనాల వినియోగం, నాటిన తొలిదశలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దీనికి కారణం. ఈ సమస్య నివారణకు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి. పొటాషియం ఎరువులను ఎకరానికి 30 కిలోలు వేసుకోవాలి. నీటి ఎద్దడి లేకుండా చూడాలి. 10 లీటర్ల నీటికి 2.5ml మాలిక్ హైడ్రోజైడ్ కలిపి పిచికారీ చేయాలి.
News September 20, 2025
రాయచోటిలో గత 30 ఏళ్లలో ఈ వర్షాలు చూడలేదు: మంత్రి

రాయచోటిలో శుక్రవారం వర్షానికి <<17770012>>మృతుల కుటుంబాలను మంత్రి మండిపల్లి<<>> రాంప్రసాద్ రెడ్డి శనివారం పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన విషయం తెలిసిందే. అయితే గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షాన్ని చూడలేదన్నారు. కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం కలచివేసిందన్నారు. వీటి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయనతో పాటు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ దీరజ్ ఉన్నారు.