News June 14, 2024
నేడు విశాఖకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ శుక్రవారం నగరానికి రానున్నారు. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయానికి ప్రత్యేక విమానంలో మద్యాహ్నం 12:20 గంటలకు విశాఖలో ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మద్యాహ్నం 12:50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వా నౌకపై రక్షణ శాఖ మంత్రి దిగనున్నారు.
Similar News
News December 26, 2025
విశాఖ: నకిలీ డాక్టర్‌గా చలామణీ అవుతున్న కేటుగాడి అరెస్ట్ (1/2)

నకిలీ వైద్యుడి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదివి కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు, గతంలో 33 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇతడి నుంచి రూ. 30 వేల నగదు, స్టెతస్కోప్, వైట్ అప్రాన్ స్వాధీనం చేసుకున్నారు.
News December 25, 2025
విశాఖ: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆనందపురం మండలంలో చోటుచేసుకుంది. ముచ్చర్లలోని YSR కాలనీలో చిన్నారి ఢిల్లీశ్వరి గురువారం ఆడుకుంటుండగా మూత లేని సెప్టిక్ ట్యాంక్‌లో కాలుజారి పడిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా, సెప్టిక్ ట్యాంకులో తేలాడుతూ
చిన్నారి కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.
News December 25, 2025
విశాఖ వుడా మాజీ అధికారి ఆస్తులు ఈడీ అటాచ్!

విశాఖ వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసుపర్తి ప్రదీప్‌కుమార్‌పై దాడులు నిర్వహించి ఈడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తులు జప్తు చేశారని తెలిపారు. జప్తు చేసిన వాటిలో ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.


