News July 1, 2024

నేడు విశాఖ కొత్త పోలీస్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులైన అదనపు డీజీ శంకబ్రత బాగ్చి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశాఖలో పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్‌ను సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుత కమిషనర్ రవిశంకర్ నుంచి సీపీగా శంకబ్రత బాగ్చి బాధ్యతలు స్వీకరిస్తారు.

Similar News

News July 3, 2024

విశాఖలో ఉల్లి కోసం క్యూ

image

రైతు బజార్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్‌లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.

News July 3, 2024

భారత్-బంగ్లాదేశ్ స్నేహబంధం బలోపేతం

image

భారత్- బంగ్లాదేశ్ నౌకా దళాల మధ్య జరుగుతున్న విన్యాసాలతో రెండు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం కానుందని మంగళవారం విశాఖలో నేవీ అధికారులు తెలిపారు. భారత్ తరఫున హాజరైన ‘ఐఎన్ఎస్ రణవీర్’ యుద్ధనౌక కమాండింగ్ అధికారి(సీవో)కి బంగ్లాదేశ్ నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ ఖొండ్కర్ మిస్బా ఉల్ అజీమ్, రియర్ అడ్మిరల్ ఎస్. ఎం. మోనిరుజ్జామన్లు వేర్వేరు జ్ఞాపికలు అందించారు.

News July 3, 2024

విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి కారణం ఇదే

image

భారత్ నుంచి 132 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇందులో ప్రధాన దిగుమతిదారులుగా అమెరికా, చైనా నిలిచినట్లు పేర్కొన్నారు. ఎగుమతుల్లో రొయ్యలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి ఆక్వా కల్చర్ పరిశ్రమ ప్రధాన కారణమని అన్నారు. వనామీ రొయ్యలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.