News June 6, 2024
నేడు విశాఖ – గుణుపూర్ రైలు రద్దు

నౌపాడ- పుండీ- తిలారు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా విశాఖ- గుణుపూర్ రైలు గురువారం రద్దు చేస్తు న్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యరాణి, పూరి, కటక్ మెమో రైళ్లు యథావిధిగా తిరుగుతాయని, ప్రయాణికులు గమనించగలరని పేర్కొన్నారు. ఈ మార్పుకి అనుగుణంగా ప్రయాణికులు ప్రణాళికలు వేసుకోవాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో సూచించారు.
Similar News
News March 2, 2026
కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 252 వినతులు

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.
News March 2, 2026
వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయండి: విష్ణుకుమార్ రాజు

GVMC ఇంజనీరింగ్ విభాగంలో 15 ఏళ్లకు పైగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను తక్షణమే బదిలీ చేయాలని మేయర్, కమిషనర్‌ను MLA విష్ణుకుమార్ రాజు కోరారు. 5-15 ఏళ్ల వరకు బదిలీ లేకుండా కొనసాగుతున్న వారిలో కొందరు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు. పారదర్శకత కోసం వెంటనే బదిలీలు చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు.
News March 2, 2026
విశాఖ: కాంట్రాక్టర్లుగా వర్క్ ఇన్‌స్పెక్టర్లు..!

GVMC ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కొలతలు తీసి ఎం-బుక్ నమోదు కోసం ఏఈలకు అందజేస్తున్నారని సమాచారం. ఏటా రూ.500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్‌లలో ఇదే తీరుగా వ్యవహారం సాగుతోందని విమర్శలున్నాయి. వీరిపై ఫిర్యాదులు చేరినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


