News March 30, 2025
నేడు వేంసూరులో మంత్రి, ఎమ్మెల్యే ఫ్యాక్టరీకి శంకుస్థాపన

సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతనంగా నిర్మించనున్న ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. 42 ఎకరాలలో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలో మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Similar News
News April 1, 2025
గ్రూప్–1,2,3,4లో సత్తాచాటిన యువకుడు

కామేపల్లి యువకుడు గ్రూప్–1,2,3,4 ఫలితాల్లో సత్తాచాటాడు. గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల కుమారుడు రత్నేశ్వరనాయుడు ఇటీవల విడుదలైన గ్రూప్-1లో రాష్ట్ర స్థాయిలో 277వ ర్యాంక్, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్ సాధించారు. ఆయన ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేదు.
News April 1, 2025
భూకంప జోన్-3లో భద్రాచలం

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.
News April 1, 2025
భద్రాచలం: కోర్టు సినిమా హీరో రోషన్‌ను అభినందించిన టీపీసీసీ సభ్యుడు.!

భద్రాచలం నివాసి రషీద్ తనయుడు హీరో రోషన్ చలనచిత్ర రంగంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. అనేక చిన్న చిత్రాల్లో నటించిన అతడు తాజాగా కోర్టు సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశారు. అల్పబడ్జెట్ చిత్రంగా రూపొందించి హిట్ సాధించడం పట్ల టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. రోషన్‌కు తల్లిదండ్రులతో పాటు భద్రాచలంలోని ప్రముఖుల అండదండలు మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు.