News January 28, 2026
నేడు వైజాగ్‌లో 4th టీ20.. జట్టులో మార్పులు?

భారత్, న్యూజిలాండ్ మధ్య 4th T20 మ్యాచ్ నేడు వైజాగ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను IND ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచులో ప్రయోగాలు చేయొచ్చు. హార్దిక్, హర్షిత్‌కు రెస్ట్ ఇచ్చి అక్షర్, అర్ష్‌దీప్‌ను ఆడించే అవకాశముంది. తొలి 3 మ్యాచుల్లో ఫెయిలైన శాంసన్ ఈరోజు రాణిస్తారా? శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE: 7PM నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో.
Similar News
News February 21, 2026
ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
News February 21, 2026
క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

స్విస్ హెల్త్‌కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్‌లో వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్‌లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్‌లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.
News February 21, 2026
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.


