News November 22, 2024
నేడు శిల్పారామానికి రాష్ట్రపతి
నేడు హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథన సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Similar News
News November 22, 2024
HYD: RRB పరీక్షలకు 42 ప్రత్యేక రైళ్లు
ఈ నెల 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి 29 వరకు గుంటూరు-సికింద్రాబాద్, ఈ నెల 24, 25, 26, 28న సికింద్రాబాద్-గుంటూరు, కరీంనగర్- కాచిగూడ, కాచిగూడ- కరీంనగర్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
News November 22, 2024
హైదరాబాద్: డ్రైనేజీ, మంచినీటి సమస్యలేమిటో తెలపండి!
జలమండలి ఎండి అశోక్ రెడ్డితో Way2News త్వరలో ఇంటర్వ్యూ తీసుకోనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ HYD పరిధిలోని ప్రజలు మీ ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీటి సంబంధిత సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తాజాగా తీసుకున్న నిర్ణయాలను సైతం ఎండీ వివరించనున్నారు.
News November 22, 2024
HYD: ముగిసిన రాష్ట్రపతి పర్యటన
HYD మాదాపూర్‌లోని శిల్పారామం వేదికగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు వీడ్కోలు పలికారు.