News November 8, 2025

నేడు సంకటహర చతుర్థి

image

ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత, కృష్ణ పక్షంలో నాల్గవ తిథిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రోజు విఘ్ననాయకుడైన గణపతికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, నిండు మనస్సుతో గణనాథుడిని పూజిస్తారు. ఇలా చేస్తే జీవితంలో సంకటాలు, ఆటంకాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు. సంకటహర వ్రతాన్ని నేడు ఆచరించడం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని నమ్మకం.

Similar News

News November 8, 2025

స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

image

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్‌ క్లెన్సర్‌, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడాలి. వారానికోసారి స్క్రబ్‌, ఆరెంజ్‌ పీల్స్‌ అప్లై చేయాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.

News November 8, 2025

4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

image

ప్రధాని మోదీ కొత్తగా 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.

News November 8, 2025

OP పింపుల్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

image

జమ్మూకశ్మీర్ కుప్వారా(D) కెరాన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చొరబాటుపై పక్కా సమాచారంతో ‘ఆపరేషన్ పింపుల్’ పేరుతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఓచోట నక్కిన టెర్రరిస్టులను గుర్తించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రమూకలు హతమయ్యారని, మరికొందరు ట్రాప్‌లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.