News November 1, 2025
నేడు సత్యసాయి జిల్లాకు సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11:15 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 12:45కు తలుపుల మండలంలోని పెదన్నవారిపల్లికి చేరుకుంటారు. గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజా వేదిక సమావేశం, 3:35 గంటలకు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:10 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
Similar News
News November 1, 2025
విజయనగరం JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్

జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు శుక్రవారం ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థులు రూ.3వేలు చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై రుసుము లేకుండా 24 గంటల్లోపే ఆన్లైన్ ద్వారా పత్రాలు పొందవచ్చన్నారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.
News November 1, 2025
APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/
News November 1, 2025
నేడు వైవీయూను సందర్శిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి

దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబరు 1న మధ్యాహ్నం 3:30 గంటలకు యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. వైవీయూలో నూతన పరిపాలన భవనంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సేనెట్ హాల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశమన్నారు.


