News March 30, 2025

నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

image

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్‌ వేదికగా CM రేవంత్ ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, పైలా రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, చల్లా సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

Similar News

News September 16, 2025

క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

image

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.

News September 16, 2025

జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

image

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News September 16, 2025

బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

image

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.