News December 15, 2025
నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.
Similar News
News December 15, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తూ బ్రహ్మే నిర్వహిస్తాడని నమ్మకం. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవాల్లో ముందు నడిచేది బ్రహ్మ రథమే. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. నారాయణుడికి సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు, హనుమంతుడు వంటి దేవతలు, పక్షులు, జంతువులు వాహన సేవ చేస్తాయి. ఇది ప్రకృతిలోని సర్వశక్తులు, సకల జీవులు స్వామివారికి సేవ చేయడాన్ని సూచిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 15, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News December 15, 2025
EVMలను నమ్మలేం: వైవీ సుబ్బారెడ్డి

ఏపీలో ఎన్నికల అక్రమాలపై ఈసీ విచారణ జరపాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్లలో అనేక తేడాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈవీఎంలను నమ్మలేమని, పేపర్ బ్యాలెట్‌పైనే అందరికీ నమ్మకం ఉందని రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు.


