News January 17, 2026
నేడు సిక్కోలు రచయిత చాసో జయంతి

సిక్కోలు గడ్డపై జన్మించిన ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) జయంతి నేడు. 1915 జనవరి 17న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన, సామాన్యుల జీవితాలను తన కలంతో అద్భుతంగా ఆవిష్కరించారు. 1942లో ‘చిన్నాజీ’ కథతో ప్రయాణం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల కాలంలో 46కు పైగా ఆణిముత్యాల్లాంటి కథలను తెలుగు సాహిత్యానికి అందించారు. వాడుక భాషా కథలకు ప్రాణం పోసిన ఆయన రచనలు నేటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. 1994 జనవరి 1న మరణించారు.
Similar News
News January 29, 2026
ఎచ్చెర్ల: భద్రతతో కూడిన ప్రయోజనాలు అపార్‌తోనే సాధ్యం

ఆటోమేటడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(APAR) ద్వారా విద్యార్థికి, విద్యా సంస్థలకు భద్రతతో కూడిన గుర్తింపు ప్రయోజనాలు సాధ్యమవుతాయని, కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ప్రాంతీయ సమన్వయకర్త రవి పాండే అన్నారు. ఎచ్చెర్ల D. BR. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇవాళ వర్క్ షాప్ నిర్వహించారు.
News January 29, 2026
శ్రీకాకుళం జిల్లా కోర్టులో రూ.23వేలతో ఉద్యోగాలు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు గడువును 30వతేదీకి అధికారులు పొడిగించారు. పోస్టుల వారీగా రూ.23,120-రూ.89,720ల వేతనమిస్తారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పత్రాని డౌన్‌లోడ్ చేసి నింపి పోస్ట్‌లో DLSA SKLM అడ్రస్‌కు పంపాలని DLSA కార్యదర్శి హరిబాబు ఓ ప్రకటనలో చెప్పారు.
News January 29, 2026
శ్రీకాకుళం జిల్లాలో 10 బార్లకు నోటిఫికేషన్..కేటాయించిన ప్రాంతాలివే

శ్రీకాకుళం జిల్లాలోని 10 బార్ లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ జిల్లా శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 5 షాపులు, పలాసలో 2 ఇచ్ఛాపురంలో 2, ఆముదాలవలసలో ఒక బార్ షాప్ ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.


