News April 5, 2024

నేడు సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన

image

నేడు సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ మరియు RES శాఖ ప్రిన్సిపల్ సెక్రేటరీ సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించనున్నారు. గజ్వేల్ మండలం అక్కారంలో 40 ఎంఎల్ సంప్ హౌజ్, కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద మల్లన్నసాగర్ తాగునీటి పంప్ హౌజ్, మంగోల్ లోని 540 డబ్ల్యూటీపీని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షలో నిర్వహించి, కొండపాక HMWSS సంప్ హౌజ్ ను సందర్శించనున్నారు.

Similar News

News December 18, 2025

MDK: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

ఈనెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డివి శ్రీనివాసరావు కోరారు. లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశం ఉన్న వివిధ రకాల కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు.

News December 18, 2025

పోలింగ్‌లో మెదక్ జిల్లాకు 5వ స్థానం

image

జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.37 శాతం పోలింగ్ నమోదై రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా ముగించడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పోలీసు యంత్రాంగం, పాత్రికేయులకు అభినందనలు తెలియజేశారు.

News December 18, 2025

మెదక్: ఎన్నికల అధికారిని సన్మానించిన కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన మూడు విడతల స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారి జుల్ఫెక్వార్ అలీని శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికను అందచేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించి, ఎన్నికలు విజయవంతం చేసిన జుల్ఫెక్వార్ అలీని కలెక్టర్ అభినందించారు.