News March 13, 2025

నేడు సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాబ్ మేళా

image

సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీ వైఎస్‌కే ఇన్ఫోటెక్‌లో ఉద్యోగాలు కల్పించడానికి నేడు కలెక్టరేట్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నేడు ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 70935 14418, 90003 85863 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 13, 2025

భీమవరం: జనసేన సభకు వెళ్లే వారికి ప్రత్యేక రూట్లు

image

పశ్చిమ గోదావరి, గుంటూరు, తెనాలి, కృష్ణ, జిల్లాల నుంచి వెళ్లే వాహనాలు తూరంగి బ్రిడ్జి నుంచి ఉప్పలంక బైపాస్ చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట మూడు లైట్లు జంక్షన్, మూత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకొవాలన్నారు. ఆయా మార్గాల్లో అభిమానులకు భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.

News March 13, 2025

‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్‌‌’ను AIగా ప్రచారం చేస్తున్నారు: నారాయణ మూర్తి

image

దేశంలో కొన్ని కంపెనీలు ‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్‌’ను AIగా ప్రచారం చేస్తున్నాయని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ప్రతి దానికీ AIతో ముడిపెడుతూ మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ‘AIలో 2 ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒకటి మెషీన్ లెర్నింగ్. ఇది ప్రిడిక్ట్ చేయడానికి లార్జ్ డేటా కావాలి. రెండోది డీప్ లెర్నింగ్. మెదడు పనితీరును అనుకరిస్తుంది. పర్యవేక్షణ లేని ఆల్గారిథమ్స్‌ను పరిష్కరిస్తుంది’అని వివరించారు.

News March 13, 2025

వికారాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు.. ఇంటర్ తప్పనిసరి

image

అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో 287 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో 238 హెల్పర్ పోస్టులు, 49 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి టీచర్ పోస్టుకు ఇంటర్ అర్హత తప్పనిసరిగా చేశారు. ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉంది.

error: Content is protected !!