News November 5, 2025

నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

image

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.

Similar News

News November 5, 2025

APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>APSRTC‌<<>>లో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందు www.apprenticeshipindia.gov.in నమోదు చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి జిల్లాను ఎంచుకుని పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.118. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 5, 2025

ఐఐటీ గాంధీనగర్‌ 36 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ఐఐటీ<<>> గాంధీనగర్ 36 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 17వరకు అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండింగ్ ఇంజినీర్, Dy రిజిస్ట్రార్, Jr ఇంజినీర్, Jr అకౌంట్స్ ఆఫీసర్, Jr అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE, బీటెక్, BLiSC, PG, LLB, CA, MBA, డిప్లొమా, ఇంటర్, జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: iitgn.ac.in

News November 5, 2025

న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

image

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.