News March 1, 2026
నేడు 444 విమానాలు రద్దు!

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ నేపథ్యంలో ఈరోజు 444 విమానాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. విమానయాన సంస్థలతో డీజీసీఏ టచ్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. ప్రయాణికులు ముందుగానే ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాలని సూచించింది. ప్రయాణికులు AirSewa ద్వారా సమస్యలను తెలపొచ్చని పేర్కొంది. కాగా నిన్న 410 డొమెస్టిక్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.
Similar News
News April 12, 2026
రేపు ప్రజా సమస్య పరిష్కార వేదిక: కలెక్టర్

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 12, 2026
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.
News April 12, 2026
ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


