News December 19, 2025
నేడు 5వ T20.. కోహ్లీని అభిషేక్ దాటేస్తారా?

IND, SA మధ్య నేడు 5వ T20 జరగనుంది. గిల్‌కు గాయం కావడంతో అభిషేక్‌తో సంజూ ఓపెనర్‌గా వచ్చే ఛాన్సుంది. కాగా ఈ మ్యాచులో అభిషేక్‌ను ఓ రికార్డ్ ఊరిస్తోంది. మరో 47 రన్స్ చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన IND బ్యాటర్‌గా నిలుస్తారు. 2016లో కోహ్లీ 1614 రన్స్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసే ఛాన్స్ వచ్చింది. అటు బుమ్రా జట్టులో చేరే అవకాశముంది. అహ్మదాబాద్‌లో 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News December 26, 2025
అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.
News December 26, 2025
ఈ రాత్రి ఢిల్లీకి సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు CWC సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 26, 2025
NABARD 44 పోస్టులకు నోటిఫికేషన్

<


