News October 19, 2025
నేడు HYDలో సీఎం పర్యటన వివరాలిలా..

నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతల్లో పర్యటించనున్నారు. ఉ.11.30కు చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమల్లో హాజరవుతారు. 12 గంటలకు NTR స్టేడియం ఎదురుగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు అందించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.
Similar News
News October 21, 2025
NZB: అమరుడా నీకు వందనం

పోలీసులు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజుల క్రితం NZBలో విధి నిర్వహణలో అమరుడైన CCS కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీసులతో పాటు జిల్లా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. నగరంలోని గూపన్పల్లికి చెందిన ప్రమోద్ 2003 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 నెలల క్రితం ట్రాఫిక్ విభాగంలో పని చేసిన ఆయన ఇటీవలే CCSకు బదలీ అయ్యారు. ఆయన సోదరుడు కూడా కానిస్టేబులే. జోహార్ ప్రమోద్.
News October 21, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ APలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 21, 2025
NRPT: శ్రీశైలం, యాదగిరి గుట్టకు ప్రత్యేక బస్ సర్వీసులు

కార్తికమాసం పురస్కరించుకొని నేటి నుంచి నారాయణపేట ఆర్టీసీ బస్ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి డీలక్స్ ప్రత్యేక బస్ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 5:10 నిమిషాలకు బయలుదేరి 11:45 నిమిషాలకు శ్రీశైలం చేరుకుంటుందని, మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 2:15 బయలుదేరి సాయంత్రం 6:45 NRPT చేరుకుంటుందన్నారు. యాదగిరి గుట్టకు ఉదయం 8:40 నిమిషాలకు బయలుదేరుతున్నారు.