News August 26, 2025
నేడు JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Adhoc-Contract-Base) పోస్టులకు ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లీష్ (1), ఫిజిక్స్ (1)కు నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు కళాశాలలోని ప్రధాన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నారు.
Similar News
News August 26, 2025
అనంతపురం: పోలీసుల గ్రీవెన్స్‌కు 60 ఫిర్యాదులు

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 60 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు వినతులు పంపారు. గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News August 25, 2025
అనంత: ముగిసిన కానిస్టేబుళ్ల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్

అనంతపురం జిల్లాలో సివిల్, ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికైన 488 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉండగా 470 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా మిగిలిన 18 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సివిల్ -278 మంది గానూ 266, APSP- 210 మందికి గానూ 204 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
News August 25, 2025
అనంతపురం జిల్లాకు CM రాక.. ఎప్పుడంటే

CM సెప్టెంబర్ మొదటి వారంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం పర్యటన కోసం అనంతపురం పరిధిలోని SK యూనివర్సిటీ వద్ద అనంతపురం- కదిరి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు.