News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులోని కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
HYD: సబ్సిడీ.. అర్హులకు ఎప్పుడు?

అర్హులైన వారికి రూ.500కే సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, గ్రేటర్ HYD పరిధిలో సుమారు 60 వేల మందికి పైగా అర్హులకు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ రానివారు ఎక్కడికి పోవాలో తెలియటం లేదని, అధికారులు దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ పలువురు ప్రజాపాలన దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.
News September 15, 2025
ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News September 15, 2025
కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు వచ్చినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం తెలిపింది. ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఫిర్యాదుల రూపంలో వచ్చినట్లు ఆయన తెలిపారు. కేసుల పరిష్కారంలో చిత్తశుద్ధి కనపరచాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు.