News February 16, 2026

నేడే ఖమ్మం మున్సిపల్ పీఠాలకు ఎన్నిక

image

ఉమ్మడి ఖమ్మంలో 7మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌‌కు చైర్మన్లు, మేయర్ ఎన్నిక ప్రక్రియ నేడు జరగనుంది. ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గణేష్ పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ముందుగా వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం ఛైర్మన్లు, మేయర్లను ఎన్నుకొనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News April 15, 2026

ఏఐకి శిక్షణ ఇచ్చే ఉద్యోగాలు.. గంటకు ₹14 వేలు!

image

Aiతో ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడుతున్నారు. కానీ ఏఐకే శిక్షణ ఇచ్చే ఉద్యోగాలున్నాయి. ఈ రంగంలోకి అడుగుపెడుతున్న లింక్డ్ ఇన్ ‘ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్’ను టెస్ట్ చేస్తోంది. Ai ట్రైనర్లకు స్కిల్‌ను బట్టి గంటకు ₹3,700-14,000 ఇవ్వనున్నట్లు లిస్టింగ్స్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా రంగాల నిపుణులు ఏఐ టూల్స్‌ సామర్థ్యాలను పరీక్షించడం, స్పందనలకు రేటింగ్ ఇవ్వడం, లోపాలను గుర్తించడం వంటివి చేస్తారు.

News April 15, 2026

ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

image

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం

News April 15, 2026

విశాఖను సౌర హబ్‌గా తీర్చిదిద్దుతాం: MP భరత్

image

విశాఖ జిల్లాను సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దుతామని MP భరత్ పేర్కొన్నారు. MVPలోని హెలెన్ కెల్లర్ పాఠశాలలో 5KV సోలార్ ప్రాజెక్టును కలెక్టర్ M.అభిషిక్త్ కిశోర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.