News October 1, 2025

నేడే గుంటూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ బుధవారం జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో 2,56,904 మంది కి రూ. 111.34 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఆదేశించారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద

image

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 4 లక్షలకు చేరువలో ఉన్న ప్రవాహం, సాయంత్రం 4 గంటల తర్వాత 5,00,213 క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీ నీటిమట్టం 13.8 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 30, 2025

GNT: ‘పత్తి రైతులు పొలంలో నీరు తొలగించుకోవాలి’

image

తుఫాను వలన ముంపుకు గురైన పంటలకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు ఒక ప్రకటనలో సూచించారు. పత్తి రైతులు వీలైనంత త్వరగా నీరు తొలగించి అంతర కృషి చేసి, నేల ఆరేటట్లు చేయాలన్నారు. అధిక తేమ వలన మొక్కలు భూమి నుండి పోషకాలను గ్రహించే స్థితిలో వుండవని చెప్పారు. అటువంటి పరిస్థితులలో మొక్కలు ఎర్రబడటం, వడలటం, ఎండిపోవడం జరుగుతుందన్నారు.

News October 30, 2025

తుపాన్ సహాయక చర్యల్లో అధికారుల పనితీరు భేష్: కలెక్టర్

image

తుపాన్ సహాయక చర్యల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లాలో మొత్తం 4,553 కుటుంబాలకు చెందిన 9,450 మందిని పునరావస కేంద్రాలకు తరలించి రక్షణ కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి రూ.3 వేలు, నిత్యవసర సరకులు ప్రభుత్వం అందిస్తోందని, ఈ కార్యక్రమాన్ని తెనాలి నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.