News October 16, 2025

నేడే తాడికొండ జలపాతం ప్రారంభం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో మరో జలపాతం అందుబాటులోకి రానుంది. గుమ్మలక్ష్మీపురం మండలం మొగనాలి (తాడికొండ) వద్ద జలపాతాన్ని పర్యాటకుల సందర్శన కొరకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. జలపాతం వరకు బస్సు సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. రానున్న కార్తీక మాసంలో వన భోజనాలకు ఆనువైన ప్రదేశమని, ఈ జలపాతం అభివృద్ధితో స్థానిక గిరిజనుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేవారు.

Similar News

News October 16, 2025

VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

image

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

News October 16, 2025

19న వేములవాడకు శృంగేరి పీఠాధిపతి..!

image

రాజన్న ఆలయాభివృద్ధే ప్రధాన ఎజెండా అని వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం.హరిత, ఎస్పీ మహేష్ బీ గితేతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తుల సూచనల మేరకు రూ.76 కోట్లు ఆలయ విస్తరణకు, రూ.35 కోట్లు అన్నప్రసాద శాలకు కేటాయించామని చెప్పారు. 19న శృంగేరి పీఠాధిపతి గుడికి రానున్నారని పేర్కొన్నారు.

News October 16, 2025

WGL: హెల్మెట్ ధరించడం నియమం కాదు.. జీవన రక్షణ!

image

హెల్మెట్ ధరించడం కేవలం రూల్స్ పాటించడం కాదు, జీవాన్ని విలువైనదిగా భావించే బాధ్యతగా చూడాలని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి రైడ్‌లో జాగ్రత్తగా, సమర్థంగా వ్యవహరించడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి బైక్ రైడ్‌కు ముందు హెల్మెట్ ధరించడం మన జీవితాన్ని సురక్షితంగా ఉంచే మొదటి అడుగని వారు సూచించారు.